Site icon NTV Telugu

పాలిసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గౌతమ్‌రెడ్డి…

పాలిసెట్ 2021 ఫలితాలు విడుదల చేసారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి. సెప్టెంబర్ 1న పరీక్ష నిర్వహణ జరిగిన ఈ పరీక్షకు 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా 64వేల మంది అర్హత సాధించారు. అంటే 100 శాతానికి 94.21% అర్హత సాధించారు. ఈ పరీక్షలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించింది శ్రీకాకుళం జిల్లా. అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం ఉంది నెల్లూరు జిల్లాలో కాగా అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం ప్రకాశం జిల్లాలో ఉంది అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. అలాగే మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేసారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 81 వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశాం అన్నారు. ఇక 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతిదీవెనగా అందించాం అని పేర్కొన్నారు.

Exit mobile version