NTV Telugu Site icon

ఏపీలో రంగంలోకి దిగిన డాగ్‌ స్వ్కాడ్

ఏపీలో ఎక్కడ వాహనాలు తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి దొరుకుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అనుమాన వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా సుమారు 6 కోట్లు విలువ చేసే నిషేదిత గంజాయిని పట్టుకున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Read Also : వీడియో : స్కూటీపై టపాసులు తీసుకెళ్లుండగా పేలుడు.. తండ్రికొడుకులు దుర్మరణం..

ఈ నేపథ్యంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు ఏపీ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రదేశాలలో తనిఖీ చేసేందుకు డాగ్‌ స్కాడ్‌ను రంగంలోకి దించారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ఏపీ పోలీసులు మాదకద్రవ్యాలను గుర్తించడానికి స్నిఫర్‌ డాగ్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు.