RK Roja: ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణినికి అరుదైన అవకాశం దక్కింది… ఐదు రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకే అవకాశం లభించిన కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియాలో రోజాకు అవకాశం దక్కింది… ఏపీ మంత్రి ఆర్కే రోజా.. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా సభ్యులుగా నిమామకం అయ్యారు. ఈ విషయాన్ని సెక్రటరి జితిన్ నర్వల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు ఈ అవకాశం లభించిందని.. అందులో ఆర్కే రోజా కూడా ఉన్నారని పేర్కొన్నారు.. దక్షిణ భారతదేశం నుంచి ఆర్కే రోజా సెల్వమణిని స్పోర్ట్స్ అథారిటీ మెంబెర్‌గా ఎంపిక చేసినట్టు వెల్లడించారు.. రోజా తనకు వచ్చిన ఈ అవకాశంపై ఆనందం వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడా మంత్రిని ఎంపిక చేయడంతో.. రాష్ట్ర క్రీడాకారులకి ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు, క్రీడా కారులు ఆశిస్తున్నారు… కాగా, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్ 2లో మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజాకు.. పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల బాధ్యతలు అప్పగించారు సీఎం.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి.. అవకాశం దొరికినప్పుడల్లా.. విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న విషయం విదితమే.
RK Roja: మంత్రి ఆర్కే రోజాకు లక్కీ ఛాన్స్..! స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా నియామకం..
Show comments