NTV Telugu Site icon

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌

Perni Nani

క‌రోనా స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ వ‌స్తోంది ఏపీ ప్ర‌భుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. క‌రోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జ‌మ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన ప్రభుత్వ పథకాల లబ్ది పొందుతోన్న వారిని వాహన మిత్ర పథకం నుంచి తప్పించామ‌ని తెలిపారు.. వాహన మిత్ర పథకం ద్వారా 2,23,300 మంది లబ్దిదారులను గుర్తించామ‌న్న మంత్రి.. ఇంటి ముందు ఆటో ఉంచి ఫొటో దిగాలి.. దాన్ని వలంటీర్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని.. లబ్దిదారుల ఎంపికలో ఏమైనా అభ్యంతరాలుంటే అర్హులైన వారు గ్రామ సచివాలయం లేదా తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సరి చేయించుకోవ‌చ్చుఅని సూచించారు.. పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తూ ఆటో యజమానైనా వాహన మిత్ర పథకం అమలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి పేర్నినాని.