NTV Telugu Site icon

అక్రమ మైనింగ్ నియంత్రిస్తే 20 శాతం రెవెన్యూ..!

Peddireddy

Peddireddy

మైనింగ్‌ పై సమీక్ష నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై జిల్లాల వారీగా అవుట్‌సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఈ విధానం వల్ల అదనంగా 35 నుంచి 40 శాతం సీనరేజీ ప్రభుత్వానికి జమ అవుతుందని అంచనా ఉందన్నారు.. వాల్యూమెట్రిక్ కు బదులు వెయిట్ బేసిస్ లో సీనరేజీ వసూళ్ళకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.. అక్రమ మైనింగ్, రవాణాను నియంత్రించగలిగితే 15 నుంచి 20 శాతం రెవెన్యూ పెరుగుతుందని అంచనా వేసిన ఆయన.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ సీనరేజీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1643 కోట్లు అని వెల్లడించారు.. ఇక, జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు జారీ చేయాలనిన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. మైనర్ మినరల్స్‌ లీజులన్నీ ఈ-యాక్షన్‌ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్న ఆయన.. మైనర్ మినరల్స్ ఈ- యాక్షన్ ద్వారా 2020-21లో రూ.476 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.. శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు యోచన చేయాలని.. ఇప్పటికే 21,577 హెక్టార్‌లలో లీజుల కోసం 2,694 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు.