Site icon NTV Telugu

రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు…

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఆరోజు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. జడ్పీ లో ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా వైఎస్సార్సీపీ అవడం మాకెంతో ఘనత. వచ్చే పంట రబికి గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం కారణంగా ఆయకట్ట తగ్గుతుందని రైతుల్లో చర్చ జరుగుతుంది. అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరగడం వల్ల నీటి లభ్యత తక్కువగా ఉంటుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. సుమారు 15 టిఎంసిల వరకు తగ్గే అవకాశం ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దళారుల ప్రమేయం కానీ మిల్లర్ల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నేరుగా అమ్ముకునే అవకాశం ఉంది అని స్పష్టం చేసారు.

Exit mobile version