Site icon NTV Telugu

Kottu Satyanarayana: దేవాలయాలలో అభివృద్ధి పనులకు టెండర్లు

Minister Kottu

Minister Kottu

ఏపీలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నాం అన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. దేవాలయాల్లో కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఖర్చు చేసే నిధులు, అభివృద్ధిపై ప్రతివారం సమీక్ష చేస్తున్నాం.మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఉన్న దేవాలయాలలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించాం.

వంద కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపడతాం. దేవాదాయ శాఖలో ఆడిట్ జరగటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 2022 మార్చి నాటికి ఆడిట్ నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చాం అన్నారు మంత్రి సత్యనారాయణ. 195 6-ఏ కేటగిరీకి చెందిన దేవాలయాల ఆడిట్ పూర్తి అవుతోంది.వీటిని త్వరలోనే అన్ లైన్ లో ఉంచుతాం.మరో 1425 6-బి కేటగిరీ దేవాలయాల్లోనూ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. ఏమైనా అవకతవకలుంటే రికవరీ కూడా సదరు అధికారిని బాధ్యుడుగా చేస్తాం.

11 వేల ఫైళ్లను గడచిన 4-5 నెలల్లో పరిష్కరించాం.అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా మందికి అర్చకులకు రూ. 20 కోట్ల మేర వ్యయమైంది.దేవాలయాలకు సంబధించిన అన్ని అంశాలు పారదర్శకంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఆగస్టు చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో అన్ లైన్ విధానం ద్వారానే లావాదేవీలు జరిగేలా కార్యాచరణ. ఇప్పటికే కాణిపాకం దేవాలయంలో ఈ వ్యవస్థ చేపట్టాం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

HYD Rains : భాగ్యనగరంలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం..

Exit mobile version