టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి నిదర్శనం కుప్పం.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది.. ఆయన జెండాను, పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్… 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఏ వర్గానికి అయినా మేలు చేశాడా..? అని ప్రశ్నించిన ఆయన.. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు చంద్రబాబు ఏమీ చేశాడు అని ప్రజలు తిరుగుబాటు చేశారు.. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం అయింది.. మమ్మల్ని వాడుకుని వదిలేశాడని బీసీలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలు, మహిళలు అందరూ తిరుగుబాటు చేశారన్నారు.. మూడేళ్లలో జగన్ మా గడపకి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వారు స్పష్టంగా చెప్తున్నారు.. మమ్మల్ని బానిసలుగా చేసుకున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని కుప్పం వస్తాడు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.. మూడు సార్లు కూడా కుప్పం రాని ఆయన ఇప్పుడు పర్యటనలనీ హడావుడి చేస్తున్నారని.. ఎన్ని అన్నా క్యాంటీన్ లు పెట్టావు… ఎంతమంది భోజనం చేశారు…? అని నిలదీస్తున్నారు.. ఒక కుప్పంలోనే కాదు 175 నియోజకవర్గాల్లో ఇదే తిరుగుబాటు ప్రారంభం అవుతుందని జోస్యం చెప్పారు జోగి రమేష్.
Read Also: Pawan Kalyan and KA Paul: కేఏ పాల్‌కి, పవన్ పాల్‌కి తేడా లేదు… ఇద్దరికీ సీట్లు లేవు..!
చంద్రబాబు ఈ రాష్ట్రంలో తిరగడానికి వీల్లేదని ముక్త కంఠంతో చెప్తున్నారన్నారు జోగి రమేష్.. మా ఓట్లు దండుకుని మాకు సున్నం పెట్టాడని అన్ని వర్గాలు తిరుగుబాటు చేస్తున్నారన్న ఆయన.. ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు.. ప్రజలు కూడా పార్టీలు, కులాలు, మతాలు చూడం… జగన్ నీ మాత్రమే చూస్తామని చెప్తున్నారన్నారు.. నీ నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కు లేదు.. ఇక రాష్ట్రానికి ఏమీ చేస్తావ్ చంద్రబాబు…? అని నిలదీశారు.. అచ్చి, బుచ్చి, బొడి అందరకీ చెప్తున్నాం.. మీరు చంద్రబాబుని నమ్ముకుంటే కష్టమే.. తండ్రీ కొడుకులనీ నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు అని తెలుగుదేశం పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.