Site icon NTV Telugu

Jogi Ramesh: గృహనిర్మాణానికి నిధుల కొరత లేదు.. 28న లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం..

Jogi Ramesh

Jogi Ramesh

గృహ నిర్మాణానికి నిధుల కొరత లేదు.. సీఎం వైఎస్‌ జగన్‌ అందరికీ సొంతింటి కలను నెరవేరుస్తారని తెలిపారు మంత్రి జోగి రమేష్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదలకు సొంతిల్లు కట్టించాలనే సంకల్పంతో‌ 31 లక్షల మందికి ఇళ్లు ఇస్తున్నట్టు వెల్లడించారు.. అందులో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు… సీఎం వైఎస్‌ జగన్ ఆలోచనా విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని.. గృహనిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.

Read Also: Pawan Kalyan: సీఎం కాన్వాయ్ కోసం వాహనాల స్వాధీనం ఏంటి?.. పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌

ఇక, అధికారులు గృహనిర్మాణం ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు మంత్రి జోగి రమేష్.. ఈ నెల 28న విశాఖలో లక్ష మందికి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు వెల్లడించారు.. అదే రోజు రెండో విడతగా 1.5 లక్షల మహిళలకు ఇళ్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.. పేదల ఇళ్లపై కొందరు కోర్టులకు వెళ్లారని మండిపడ్డారు.. అయితే, దేవుడి ఆశీస్సులతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు.. రాష్ట్రంలోని అర్ములైన అందరికీ సొంతింటి కలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తారని వెల్లడించారు మంత్రి జోగి రమేష్‌.

Exit mobile version