Site icon NTV Telugu

Jayaram: మా తలరాతలు మార్చేది సీఎం జగనే.. ఆదేశిస్తే కాళ్ల ముందు తల వంచి..!

Gummanur Jayaram

Gummanur Jayaram

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో ఉండేది ఎవరు..? ఊడేది ఎవరు..? కొత్తగా వచ్చేది ఎవరు..? ఎవరికి ఏ శాఖ..? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, మా తలరాతలు మార్చేది సీఎం జగనే అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… ఇన్నాళ్లూ మంత్రిగా చేయడం నా అదృష్టంగా తెలిపారు.. రాజీనామా చేయమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఆయన కాళ్ల ముందు తల వంచి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ మంత్రిగా అవకాశం కల్పిస్తారనే సంకేతాలు నాకేం లేవు.. అందరితో పాటు నేనూ రాజీనామాకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Read Also: Ukraine Russia War: రష్యాపై మరిన్ని ఆంక్షలు..

ఇక, సీఎం వైఎస్‌ జగన్ నాకు మరోసారి అవకాశం కల్పిస్తారో లేదో నాకు తెలియదు అన్నారు మంత్రి జయరాం… విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ఇవాళ రేపట్లో బెంజ్ కారు అనేది గొప్ప విషయమేం కాదన్నారు.. కార్ల కొనుగోళ్లకు చాలా బ్యాంకులు రుణాలిస్తున్నాయని.. ఏం లేకున్నా.. ప్రతిపక్ష టీడీపీ నాపై అవాస్తవాలు గుప్పించిందంటూ మండిపడ్డారు.. నా శాఖలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసి.. అచ్చెన్నాయుడు వ్యవహారాన్ని బయటపెట్టామని వెల్లడించారు మంత్రి గుమ్మనూరు జయరాం.

Exit mobile version