NTV Telugu Site icon

Minister Amarnath: రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం

Gudivada Amarnath

Gudivada Amarnath

పెట్టుబడి దారులకు అనువైన వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా ఉందన్నారు మంత్రి అమర్‌నాథ్‌… దావోస్ టూర్ పై విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పరిశ్రమలశాఖ మంత్రి అమర్ నాథ్… వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంటే మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సామర్థ్యం, పాలసీలను వెల్లడించడానికి ఒక ఫ్లాట్ పామ్‌ అన్నారు.. అయితే, అక్కడ నుంచి లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చామని గత ప్రభుత్వాలు చేసింది దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకునే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈసారి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఉన్నతస్థాయి బృందం దావోస్‌ వెళ్తుందన్నారు. ఇక, సహజ వనరులు, సుదూర సముద్ర తీరం, రైల్, రోడ్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీతో అద్భుత అవకాశం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా అభివర్ణించారు. 46 శాతం మెరైన్ ఎక్స్‌పోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోందని వెల్లడించారు మంత్రి అమర్‌నాథ్‌.

Read Also: Atchannaidu: వైసీపీ ఓ గాలి పార్టీ.. గాలికొచ్చి.. గాలికే పోతుంది..!