Site icon NTV Telugu

Goutham Reddy Died: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

ఏపీలో విషాదం నెలకొంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం మరణించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకుని ఆదివారమే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన వయసు 50 ఏళ్ళు.

ఇటీవల వారం రోజులపాటు దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు గౌతమ్‌రెడ్డి. జగన్ కేబినెట్లో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గౌతమ్‌రెడ్డి. 2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. గౌతమ్‌రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మం. బ్రాహ్మణపల్లి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. నెల్లూరు జిల్లా పారిశ్రామికవేత్త, రాజకీయవేత్తగా పేరుపొందారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఇతను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకె లో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందారు.

Exit mobile version