NTV Telugu Site icon

Dharmana: మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు.. కేవలం నిజాయితీవల్లే సాధ్యం..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

రెవిన్యూ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవినితి ఎక్కువగా ఉందని, ఇది అవమానకరంగా ఉందన్నారాయన.. అందుకే అనేక పథకాలను.. లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అయితే, ఇదే సందర్భంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ధర్మాన.. ప్రజలు నిజాయితీ కలిగిన నాయకులను కోరుకుంటున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేసిన ఆయన.. ఇది కేవలం ఆయన నిజాయితీవల్లే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అందుకే అధికారంలోకి వచ్చిందంటున్నారు. నేతలు, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వంలో ఉన్నవారు.. నిజాయితీ పాలన అందించడమే మన తక్షణ కర్తవ్యమని హితబోధ చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Read also: Anil Kumar Yadav: సభ నిర్వహించి తీరుతా.. ఎవరికీ పోటీగా కాదు..