నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు. రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుండి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని…కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. ఈ సమయంలో ఎంపీని అరెస్టు చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదని…అసలు వారికి ఏంటి అతని మీద అంత ప్రత్యేక శ్రద్ధ అని చురకలు అంటించారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా ఇలాంటి ప్రాంతంలో ఒక చీడపురుగుని ఎంపీగా ఎన్ను కున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఎంపీపై నేను సైతం గతంలో కేసు పెట్టడం జరిగిందని… ప్రజల మనోభావాలు, ఆచారాలు అతనికి అవసరం లేదు… అలాంటివారికి గుణపాఠం అవసరమన్నారు. ముఖ్యమంత్రి బయటకు రావడంలేదని ఇతను విమర్శిస్తున్నారని…నాయకుడు పైనుండి సమీక్షించాలి… అంతే గాని ప్రజల్లోకి వస్తేనే సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో తో గెలుపొందారు కానీ, అతను తన ఫ్రేమ్ తో గెలవలేదని రఘురామకృష్ణంరాజు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఒక చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారు…
