NTV Telugu Site icon

మరింత మెరుగైన సేవలు.. అర్హులను గుర్తించడానికి కృషి

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూసేందుకు వినూత్న రీతిలో గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ… ఇకపై ప్రతి నెల ఆఖరి శుక్ర, శని వారాల్లో ఇంటింటికి సచివాలయ సిబ్బంది తిరుగుతారని వెల్లడించిన ఆయన… ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో కూడిన కరపత్రాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకి వెళ్లి అందిస్తారని తెలిపారు.. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అందుకోకుండా ఉన్న అర్హులని గుర్తించి వారికి మేలు చేయడానికి మరింత అవకాశం ఏర్పడుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.