Site icon NTV Telugu

ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన క్రీడా పోటీలు : అవంతి శ్రీనివాస్

రాష్ట్ర స్థాయి క్రీడా అధికారులతో క్రీడా, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించాం అని తెలిపారు. అలాగే ఈ 13న కేంద్ర క్రీడల శాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక సీఎస్ఆర్ లో భాగంగా క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం, సహకారం లభించేలా ప్రయత్నం చేస్తాం అని చెప్పిన ఆయనరాష్ట్రానికి మూడు అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు రావలసిన అవసరం ఉంది. స్పోర్ట్స్ పాలసీ డ్రాఫ్ట్ సిద్ధం అయ్యింది. సీఎం ఆమోద ముద్రతో దసరా లోపు పాలసీ ప్రకటన ఉంటుంది అన్నారు. అలాగే రుషి కొండ ప్రాజెక్టు వచ్చే జూన్ కల్లా పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు.

Exit mobile version