NTV Telugu Site icon

Ambati Rambabu: పోలవరం ఆలస్యానికి అసలు కారణం ఇదే..!

Ambati Rambabu

Ambati Rambabu

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఈ సీజన్‌లో నిర్మాణ పనుల ఆలస్యానికి కారణం.. భారీ వర్షాలు, వరదలే అన్నారు.. ఈ సీజన్‌లో ఊహించని విధంగా వరదలు రావడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయన్న ఆయన.. మూడు సార్లు వరదల కారణంగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామన్నారు.. అయితే, వరద మరింత తగ్గు ముఖం పట్టాక డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. పనులు ఆలస్యం కావడం మాత్రం బాధ కలిగిస్తుందన్నారు అంబటి రాంబాబు. కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టి గత ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసిందని మండిపడ్డారు… గత ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పిదంతో ఇప్పుడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌శాఖ మంత్రి అంబటి రాంబాబు.

  Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు.. క్షమాపణ చెప్పాల్సిందే..

పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పడం లేదని టీడీపీ, జనసేన నేతలు నన్ను విమర్శిస్తున్నారు.. కానీ, టీడీపీ దుర్మార్గం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్నారు అంబటి రాంబాబు.. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పై ఏం చెయ్యాలో కేంద్ర, రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నామన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చెయ్యబోయేది సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డేనని ధీమా వ్యక్తం చేశారు.. రెండు కోట్ల రూపాయలతో త్వరలో ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తు పనులు చేపడతామని వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు.. నిర్మాణ పనుల్లో ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే..