మెడికల్ టూర్ నిమిత్తం రేపు కేరళ వెళ్లనుంది ఆంధ్రప్రదేశ్ బృందం.. ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళలోని వైద్య విధానాలను అధ్యయనం చేయనుంది ఆంధ్రప్రదేశ్ టీమ్.. కేరళ ప్రభుత్వం అవలంభించిన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలనూ పరిశీలించనున్నారు ఏపీ అధికారులు.. కేరళ వైద్య విధానాలను ఏపీలో అవలంభించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, సీఎం వైఎస్ జగన్ సూచనలతో కేరళ వెళ్లనుది ఏపీ అధికారుల బృందం. మరోవైపు.. కేరళలో కరోనా మొదటి దశలో.. రెండో వేవ్‌లోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది అక్కడి సర్కార్.. అయితే, కరోనా సెకండ్ వేవ్ నుంచి కేరళలలో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాలేదు.. తాజాగా, మళ్లీ 30 వేల మార్క్‌ను దాటేశాయి రోజువారి కరోనా పాజిటివ్ కేసులు.
కేరళకు ఏపీ టీమ్..
AP Govt