ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందడి కట్టుదిట్టమైన భద్రత, పర్యవేక్షణ ఏర్పాట్ల మధ్య మొదలైంది. విశాఖపట్నం, గుంటూరు మినహా మిగిలిన జిల్లాల్లో 42 డివిజన్లు, 201 మండలాల పరిధిలో 3,240 గ్రామపంచాయతీలలో ఓటింగ్ జరుగుతుండగా, 709 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి; మరోవైపు 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు లేదా నగర పంచాయతీలలోనూ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పంచాయతీ పరిధిలో 74,45,583 మంది ఓటర్లు, పట్టణ సంస్థల పరిధిలో 24,98,312 మంది ఓటర్లు ఉండగా, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు, భారీ సిబ్బందితో అధికారులు పకడ్బందీగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన తాజా వివరాలను లైవ్ అప్‌డేట్స్‌లో వీక్షించండి.
-
ఏలూరు జిల్లా
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్. జిల్లా వ్యాప్తంగా 164 పంచాయతీ స్థానాలకు,1572 వార్డులకు జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరగనున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.
-
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, ఆముదాలవలస, రాజాం మున్సిపాలిటీలకు జరగనున్న పోలింగ్.. సుమారు ఎన్నికల విధులకు 1800 మంది సిబ్బంది నియమించారు.. 2,200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు... శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు, ఆముదాలవలస మున్సిపాలిటీలో 28 వార్డ్లు, రాజాం మున్సిపాలిటీలో 32 వార్డులలో జరగనున్న పోలింగ్..
-
తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్
ఏపీలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. మధ్యాహ్నం 1 వరకు కొనసాగనున్న పోలింగ్. విశాఖపట్నం, గుంటూరు మినహా 26 జిల్లాల్లో పోలింగ్. 42 డివిజన్లు, 201 మండలాల్లో ఎన్నికలు.

