KGBV జాబ్స్.. 299 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే దరఖాస్తులు.!
- రాష్ట్రవ్యాప్తంగా 299 టీచింగ్ పోస్టుల భర్తీ
- మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం
- జూన్ 5 వరకు ఆన్లైన్ దరఖాస్తులు
- ప్రిన్సిపాల్, PGT, CRT, PET పోస్టుల వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మొత్తం 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (IAS) ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026-27 విద్యాసంవత్సరానికి గాను చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అర్హత , ఆసక్తి గల మహిళా అభ్యర్థులు మే 27, 2026 నుండి జూన్ 05, 2026 వరకు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 299 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 16 ప్రిన్సిపాల్ పోస్టులు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRT) , 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET) ఖాళీలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు జిల్లాలను మినహాయించి, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Also Read
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం, వయోపరిమితి, విద్యా అర్హతలు , ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://kgbvrecruitment.apcfss.in ను సందర్శించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో లేదా వెబ్సైట్లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం అభ్యర్థులు సంప్రదించాల్సిందిగా హెల్ప్‌లైన్ నంబర్లను (70750 39990, 79933 29115) కూడా అధికారులు ఈ ప్రకటనలో జారీ చేశారు. కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే కేజీబీవీల్లో అవకాశం ఉంటుంది కాబట్టి, నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!