Site icon NTV Telugu

Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల

Inter Results

Inter Results

ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇంటర్ పరీక్షలకు దాదాపు 4,64,756 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇప్పటికే టెన్త్ ఫలితాలు విడుదల కాగా.. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా కొన్ని రోజులుగా ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఎంతో ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా https://examresults.ap.nic.in వెబ్ సైట్ ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. పదో తరగతి ఫలితాలలో పాస్ పర్సంటేజీ తక్కువగా రావడం విమర్శలకు తావిచ్చింది. మరి బుధవారం విడుదల కానున్న ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతంపై అందరి దృష్టి నెలకొంది.

CM Jagan: ఏపీలో రహదారుల మరమ్మతులు వేగవంతం చేయాలి

Exit mobile version