Site icon NTV Telugu

AP Inter Supply Results: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Ap Inter Supply Results

Ap Inter Supply Results

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు విడుదల చేశారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్ట్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగాయి. జనరల్ ఇంటర్ తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఇక ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే వీరిలో.. 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ లో 35 శాతం.. ఒకేషనల్ లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ సెకండియర్ జనరల్ లో 33 శాతం.. ఒకేషనల్ లో 46 శాతం మంది పాస్ అయ్యారు. ఈపరీక్షా ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్ సైట్లలోకి లాగిన్ అయి చూసుకోవచ్చు.

ఏపీలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు June 22న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఇంటర్‌ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4, 45, 604 మంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు 4 లక్షల 23 వేల 455 మంది. ఒకేషనల్ పరీక్షలు రాసిన విద్యార్థులు 72వేల 299 మంది. మొత్తంగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు 9,41,358 మంది. తొలిసారిగా సీసీ కెమేరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించింది ఇంటర్ బోర్డు.

ఇంటర్ ఫలితాలను విడుదలచేశామని, సీడీ పాస్ వర్డ్ అందుబాటులో వుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చిలో జరగాల్సిన పరీక్షలను మే నెలలో నిర్వహించామన్నారు. స్పాట్ వాల్యుయేషన్ వేగంగా పూర్తిచేశామన్నారు. ఈ పరీక్షల్లో రికార్డ్ స్థాయిల్లో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. మొదటి సంవత్సరం 54 శాతం, సెకండియర్ లో ఉత్తీర్ణత శాతం 61 శాతంగా వుందన్నారు. ఫస్టియర్ లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం పాసయ్యారు. సెకండియర్‌ లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం పాసయ్యారు.

మొదటి సంవత్సరం 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి ఏడాది 54శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 4,23,458 పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారు 2,58,449. ఇంటర్ ఫలితాల్లో దుమ్ము రేపారు బాలికలు. ఉమ్మడి జిల్లాల్లో టాప్ లో కృష్ణా జిల్లా వుంది. కృష్ణా జిల్లాలో 72 శాతం, చివరి ప్లేస్ లో కడప 50 శాతంగా పేర్కొన్నారు.
AP Inter Supply Results: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Exit mobile version