Site icon NTV Telugu

Andhra Pradesh: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 7 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానం లేకుండా పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది. సెకండియర్ విద్యార్థులంతా రేపటి నుంచి తమ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది.

కాగా ప్రాక్టికల్స్‌ పరీక్షలకు జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ ఏడాది జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహించాలని, ఏ కాలేజీ విద్యార్ధులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని హైకోర్టు ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. దీంతో మార్చి 11న ప్రారంభం కావాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

https://ntvtelugu.com/polavaram-project-radial-gates-alignment-completed/
Exit mobile version