మహిళల భద్రత కోసం దిశా చట్టాన్ని తీసుకుని వచ్చాం. ఈ చట్టం వచ్చిన తర్వాత విచారణ, శిక్ష ఖరారు వేగంగా జరుగుతోంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. 2019లో 100 రోజుల్లో విచారణ పూర్తి చేస్తే ఈ ఏడాదిలో 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసే పరిస్థితి ఉంది. 2,114 కేసులను 40 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు వాళ్ళు కూడా అమల్లోకి తీసుకుని వచ్చేందుకు దిశ చట్టం తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. వనజాక్షి, రిషికేశ్వరి, కాల్ మనీలో మహిళల పై అత్యాచారాలు వంటి అనేక ఘటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. అప్పుడు మహిళలకు ఎలాంటి భద్రత ఇచ్చారు అని అడిగారు.
ఇక రమ్య డెడ్ బాడీని తరలించకుండా లోకేష్ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నారు అని తెలిపారు. బాధితులకు మానవత్వంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంటే టీడీపీ విమర్శలు చేస్తోంది. దళితులు స్నానం చేయరు, మురికిగా ఉంటారని అప్పట్లో టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానిస్తే చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని కించపరుస్తూ మాట్లాడింది చంద్రబాబు అని పేర్కొన్నారు.