3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. 3 నెలల్లో ప్లాన్‌ను పూర్తిచేయాలని హైకోర్టు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది.
అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖాకు వీల్లేదని కోర్టు వెల్లడించింది. రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, 3 నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలంది. 6 నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలి. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది ఏపీ హైకోర్ట్.కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.