NTV Telugu Site icon

AP Highcourt: మిడ్ లెవల్ హెల్త్‌ సూపర్ వైజర్‌ పోస్టుల భర్తీ.. ఏపీ సర్కార్‌ కి ఎదురుదెబ్బ

Aphighcourt

Aphighcourt

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిడ్ లెవల్ హెల్త్‌ సూపర్ వైజర్‌ పోస్టుల భర్తీపై హైకోర్టులో ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో రాష్ట్రంలో 1681 హెల్త్‌ సూపర్ వైజర్‌ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది డివిజినల్ బెంచ్. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజినల్ బెంచ్ లో రిట్ అపీల్ దాఖలు చేశారు హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్‌. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్దంగా ఆయుష్‌ డాక్టర్ల పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా, ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రవణ్‌.

Read Also: GHMC : అందుబాటులోకి 5 వైకుంఠధామాలు.. ఇంకో ఐదు త్వరలో

ప్రభుత్వం తరపున భర్తీకి అవకాశం ఇవ్వాలని రాబోయే ఎంపికల్లో వారి పేర్ల పరిశీలనకు తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వ న్యాయవాది. మార్గదర్శక సూత్రాలకు విరుద్దంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. మొత్తం ప్రక్రియపై స్టే విధించింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (CFW).. ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల పోస్టుల భర్తీ ఈ ఏడాది ఏప్రిల్ లో చేపట్టింది.

అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదని, నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తామని ప్రకటనలో పేర్కొంది. బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అర్హతగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్‌ కౌన్సిలింగ్‌లో రిజిస్టర్‌ అయ్యి ఉండాలని అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థి అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని ప్రకటనలో వివరించారు. తాజా ఉత్తర్వులతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.

Read Also: Rajasingh Wife Usha Bai : రాజాసింగ్‌లో ప్రవహించేది కాషాయ రక్తమే

Show comments