NTV Telugu Site icon

Aswani Dutt Petition: గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ.. కౌలు చెల్లించాలని హైకోర్ట్ ఆదేశాలు

aphighcourt

5142fb1a A3b0 460d 87eb C7348a69e75e

గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణకు భూములిచ్చిన వారికి ‌కౌలు చెల్లించకపోవడంపై సినీ నిర్మాత అశ్వనీదత్ దంపతుల పిటిషన్ పై హైకోర్టులో జరిగిన విచారణ జరిగింది. విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన వారికి వార్షిక కౌలు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి వైఖరివల్ల పౌరులు ఇబ్బంది పడటానికి వీల్లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కౌలు చెల్లించాల్సిన బాధ్యత వారిదేనని తేల్చి చెప్పింది. సాంకేతిక కారణాలు చూపుతూ, జాప్యం చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్ట్ పేర్కొంది.

Read Also: Warangal Market: ఎనుమాముల మార్కెట్ ప్రారంభం.. వ్యాపారస్తులు, రైతులకు మంత్రి సూచన

కౌలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూశాఖను కోర్టు ఆదేశించింది. మంగళవారం కూడా దీనిపై విచారణ జరగనుంది. సమాధానం సంతృప్తిగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని వ్యాఖ్యానించింది. విమానాశ్రయ విస్తరణకు తమ నుంచి 39 ఎకరాల భూమిని సమీకరించారని, కౌలు చెల్లించడం లేదని ప్రముఖ సినీ నిర్మాత చలసాని అశ్వినీదత్, ఆయన సతీమణి వినయ కుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న హైకోర్టు..జ. కౌలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ పిటిషన్ పై నేడు మరోసారి విచారించనుంది హైకోర్టు.

Read Also: Rohtak Dharampal: ఎన్నికల్లో ఓడిపోయాడు.. భారీ బహుమానం పొందాడు