Site icon NTV Telugu

కేంద్రం పై ఏపీ హైకోర్టు అసహనం…

కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదన్న ప్రభుత్వం… తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసారని.. 100 టన్నుల ఆక్సిజన్ లో మహారాష్ట్ర కు 97 టన్నులు, ఏపీకి 3 టన్నుల సరఫరా చేసింది అని తెలిపింది ప్రభుత్వం.

అయితే ఇలా ఎలా చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని రాష్ట్రాలకు అవసరాలకు సరిపడా సరఫరా బ్యాలె న్సింగ్ చేస్తామని కేంద్రం తెలిపింది. ఆసుపత్రుల్లో బిల్ చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ద్వారా చేయాలన్న హైకోర్టు… అవసరానికి సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దానికి మూడు నెలల సమయం పడుతున్న కేంద్రానికి… ఇది చాలా ఎక్కువ సమయమని, వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలనీ హైకోర్టు సూచించింది. కంప్రెషర్ల తయారీలో జాప్యం జరుగుతోందని, జూన్ మొదటి వారంలో 15 ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొంది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

Exit mobile version