NTV Telugu Site icon

AP High Court On BiggBoss: అశ్లీలతపై ధర్మాసనం సీరియస్

High Court On Bigg Boss

High Court On Bigg Boss

AP High Court Serious On Bigg Boss Show: బిగ్‌బాస్ కార్యక్రమాన్ని బ్యాట్ చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ సాగింది. ఈ సందర్భంగా.. షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఐబీఎఫ్ గైడ్‌లైన్స్ కూడా పాటించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత స్పందించిన న్యాయస్థానం.. అశ్లీలతపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. 1970లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా? అని సూచించింది. దీనిపై స్పందించేందుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరారు. ఈ నేపథ్యంలోనే విచారణను అక్టోబర్ 11కు కోర్టు వాయిదా వేసింది. తదుపరి వాయిదాలో ప్రతివాదులకు నోటీసులపై నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది.

కాగా.. బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువైపోతోందని మొదటి సీజన్ నుంచే ఆ కార్యక్రమంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆ కంటెంట్‌తోనే టీఆర్పీ వస్తోందని, డోస్ పెంచింది. దీంతో ఈ షోని బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ పెరిగాయి. ఎమ్మెల్యే రాజాసింగ్, సీపీఐ నారాయణ సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ షోపై ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఫో చూడలేరని, దీని వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. ఇప్పుడు అశ్లీలతపై పిల్ దాఖలవ్వడం, దానిపై ధర్మాసనం సీరియస్‌గా రియాక్ట్ అవ్వడంతో.. ఇది హాట్ టాపిక్ అయ్యింది. తదుపరి విచారణలో వ్యవహారం ఎలా ఉండబోతోందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.