Site icon NTV Telugu

Telugu Desam Party: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఊరట

Ashok Gajapati Raju

Ashok Gajapati Raju

చెన్నై ఆస్తి విషయంలో కేంద్ర మాజీ మంత్రి, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు ఊరట లభించింది. చెన్నై మైలాపూర్‌లోని 37,902 చదరపు అడుగుల భూమికి సంబంధించిన దస్త్రాలను తీసుకుని స్వయంగా హాజరుకావాలంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులను హైకోర్టు నిలిపివేసింది. ఏ వివరాల ఆధారంగా అశోక్‌గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారని ఈడీని హైకోర్టు ప్రశ్నించింది.

ఈ కేసు వివరాల రికార్డులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని ఈడీ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి వివాదంలో ఈడీ ఎలా జోక్యం చేసుకుంటుందని నిలదీసింది. ఈ విషయం తమకు చాలా ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ వెల్లడించారు.

Chandra Babu: జగన్ ‘పన్నుల’ పాలనను చాటి చెప్పేలా.. ‘బాదుడే .. బాదుడు’

Exit mobile version