NTV Telugu Site icon

డెల్టా వేరియంట్‌పై ఆందోళ‌న అవ‌స‌రం లేదు…

దేశంలో సెకండ్ వేవ్ ఉదృతికి ప్ర‌ధాన కార‌ణం డెల్టా వేరియంట్ అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  అయితే, ఈ వేరియంట్ ఇప్పుడు ఉత్ప‌రివ‌ర్త‌నం చెంది డెల్టీ ప్ల‌స్ వేరియంట్‌గా మారింది. దేశంలో ఇప్ప‌టికే 40కి పైగా కేసులు న‌మోద‌య్యాయి. రెండు మ‌ర‌ణాలు కుడా సంభ‌వించాయి. క‌రోనా కేసులు, డెల్టా వేరియంట్‌లపై ఏపీ ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల నాని కొన్ని కీల‌క విష‌యాల‌ను తెలిపారు.  డెల్టాప్ల‌స్ వేరియంట్‌పై ఆందోళ‌న చేందాల్సిన అవ‌స‌రం లేద‌ని, తిరుప‌తిలో ఒక డెల్టా వేరియంట్ న‌మోదైంద‌ని, ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ కూడా అయినట్టు మంత్రి పేర్కొన్నారు.  

Read: ఈ మెడిసిన్ ఖ‌రీదు రూ.18 కోట్లు… దేనికి వాడ‌తారంటే…

ప్ర‌స్తుతం రాష్ట్రంలో డెల్టాప్ల‌స్ వేరియంట్ యాక్టీవ్ కేసులు లేవ‌ని, రోజూ ల‌క్ష వ‌ర‌కూ ప‌రీక్ష‌లు చేస్తున్నా, కేసుల సంఖ్య కేవ‌లం ఐదువేల లోపే న‌మోద‌వుతున్నాయ‌ని అన్నారు.  జీరోస్థాయికి తీసుకెళ్ల‌డానికి అన్నిర‌కాల చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు మంత్రి తెలిపారు.  థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌నే స్ప‌ష్టత లేకున్నా, అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని, క‌ర్ఫ్యూ కొన‌సాగించాలా వ‌ద్దా అనే అంశంపై సీఎం నిర్ణ‌యం తీసుకుంటార‌ని మంత్రి ఆళ్ల‌నాని తెలిపారు.