NTV Telugu Site icon

Jagan Students Scheme: ఏపీలో విదేశీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

Cm Jagan (3)

Cm Jagan (3)

ఏపీలో విదేశీ విద్య అభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. జగనన్న విదేశీ విద్యాదీవెనపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించనుంది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును భరించనుంది ప్రభుత్వం. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంది.

100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించనుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తారు. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు. ఫస్ట్‌ సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపులు చేస్తారు. నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపులు జరుపుతారు. పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు వుంటాయి.

ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తించనుంది. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తించారు. ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపికచేస్తుంది.

2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టింది గత ప్రభుత్వం. చంద్రబాబు సర్కారు సమయంలో ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు వర్తింప చేయలేదు. ఇప్పుడు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. గతంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి వర్తింపు. ఆదాయ పరిమితి పెంచిన వైయస్‌.జగన్‌ సర్కారు. ఇప్పుడు రూ.8 లక్షల లోపు ఉన్నవారికీ వర్తింప చేస్తున్నారు. ప్రపంచంలోని కొన్నిదేశాలకే వర్తింపు చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది.

LIVE : గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..! l

గత ప్రభుత్వ విదేశీ విద్యా పథకంలో పలు లోపాలు వున్నాయని ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య అమల్లో పలు లోపాలను గుర్తించిన విజిలెన్స్‌ మరియు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగం. లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులు పాటించలేదని నిర్దారించారు. ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే లబ్ధిదారులైన కొందరు విద్యార్థులు తాము చదువుతున్న యూనివర్శిటీని, వెళ్లాల్సిన దేశాన్ని కూడా మార్చుకున్నారని గుర్తించారు. అధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్శిటీలను మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో స్కీం నుంచి డబ్బు పొందాక కోర్సులు పూర్తిచేయకుండానే వెనుదిరిగి వచ్చేశారు కొందరు విద్యార్థులు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు అన్న నిబంధనను ఉల్లంఘించి ఒకే కుటుంబంలో ఒకరికి అంతకంటే ఎక్కువమందికి పథకం వర్తింపచేశారు. ఈసారి ఈ లోపాలు లేకుండా పకడ్బందీగా పథకం అమలుచేయనుంది ప్రభుత్వం.

Bike Riders: విశాఖలో బైక్ రైడర్స్ ఆగడాలు.. 13మందిపై కేసులు