Site icon NTV Telugu

AP Govt: మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

Ap Govt

Ap Govt

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని డ్రెయిన్లలో సిల్ట్ తొలగించాలి అని సూచించారు. సిల్ట్ తొలగింపుపై ప్రతి వారం నివేదికలు పంపించాలి అని తెలిపారు. చెత్త డంపింగ్ సైట్లలో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలి అని పేర్కొన్నారు.

Read Also: SRH: చెప్పి మరీ అద్దాలు పగలగొడుతున్న అభిషేక్.. ప్రాక్టీస్ వీడియో వైరల్

ఇక, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠినంగా వ్యవహరించాలి అని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఒక మోడల్ స్వర్ణాంధ్ర పార్క్ ఏర్పాటు చేయాలి అని చెప్పారు. పచ్చదనం, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అని పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రా ప్రచారాన్ని నిజమైన ప్రజల కార్యక్రమంగా రూపొందించాలి ఐఏఎస్ అధికారి సురేష్ వెల్లడించారు.

Exit mobile version