Site icon NTV Telugu

రేపు ఏపీలో తొలిసారి వైఎస్సార్‌ అవార్డుల ప్రధానం…

సామాన్యలలో అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరిస్తుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. రాష్ట్రంలో తొలిసారి వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రధానం చేయనున్నారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ – కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టనుంది ప్రభుత్వం. 2021 సంవత్సరానికి 29 వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 30 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రధానం చేస్తున్నారు.

ఈ అవార్డులలో సంస్ధలు – 9, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు – 11, కళలు, సంస్కృతి – 20, సాహిత్యం – 7, జర్నలిజం – 6 కోవిడ్‌లో వారియర్స్ ప్రభుత్వ వైద్య సిబ్బంది – 6 అవార్డులు ఇస్తున్నారు.

Exit mobile version