ఏపీలో ఓ వైపు పీఆర్సీ రగడ నడుస్తుండగానే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల చెల్లింపుల పై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జీతాల చెల్లింపు ప్రాసెసింగ్‌కు కూడా ఇవాళే డెడ్ లైన్ ఉంది. దీంతో ఆర్థిక శాఖ శర వేగంగా పీఆర్సీ బిల్లులను సిద్ధం చేస్తోంది. నిన్న, మొన్న ఉద్యోగుల జీతాల బిల్లులు అప్లోడ్ చేసిన ట్రెజరీ శాఖ ఉద్యోగులు.
Read Also: మరింత ముదిరిన పీఆర్సీ ఫైట్..తగ్గేదిలే అంటున్న ఉద్యోగులు
శనివారం, ఆదివారం అర్థరాత్రి వరకు బిల్లులులను ఉద్యోగులు అప్లోడ్ చేశారు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఓర్సీ ప్రకారం ఉద్యోగులు సిద్ధం చేశారు. పే అండ్ అకౌంట్స్‌లో 50 వేల బిల్లులను ప్రాసెస్ చేసిన అధికారులు. ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణలో బిల్లులును ఉద్యోగులు సిద్ధం చేశారు. ఈ రోజు నుంచి పెన్షనర్ల బిల్లులను రెడీ చేయనున్న ఉద్యోగులు. ఇదిలా ఉంటే ఉద్యోగ సంఘాల తమ తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతు న్నాయి.ఇప్పటికే ప్రభుత్వానికి తమ డిమాండ్లు చెప్పామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
