NTV Telugu Site icon

రోడ్ల నిర్మాణ చెల్లింపుల్లో కొత్త విధానం… నేరుగా బ్యాంకుల నుండే

రోడ్ల నిర్మాణ చెల్లింపుల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పూర్తి చేసిన పనికి నేరుగా బ్యాంకుల ద్వారానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్- RDC ఎండీ కాంట్రాక్టర్ల జాబితాను CFMS ద్వారా సంబంధిత బ్యాంకులకు అందచేయాలని ఆదేశించింది. విడుదల చేయాల్సిన నిధుల వివరాలను బిల్లులతో సహా CFMS ద్వారా బ్యాంకులకు అందచేయాలని సూచించింది. RDC ఎండీ ఖాతాకు నిధులు విడుదల చేసి అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ చేయనున్నాయి బ్యాంకులు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. రోడ్ల నిర్మాణం కోసం పెట్రోల్ సెస్ ద్వారా వచ్చే నిధులతో రోడ్ల మరమ్మత్తులకు, నిర్మాణాలకు గతంలోనే ఆమోదించింది ప్రభుత్వం. పెట్రో సెస్ ను ఎస్క్రో చేసి రోడ్ల నిర్మాణం కోసం రూ. 2వేల కోట్ల మేర రుణాలను బ్యాంకుల నుంచి సమీకరించుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది.