నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత స్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు.. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని స్పష్టం చేసింది సర్కార్.. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు.. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, లైట్లు వంటి వాటిని తనిఖీ చేయటంతో పాటు మరమ్మత్తులు చేసే అంశంలో విద్యార్ధుల తల్లి తండ్రుల కమిటీలతో కలిసి పని చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరుగుదొడ్ల నిర్వహణ కోసం నిధుల్ని ప్రత్యేకంగా ఉంచాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు సంబంధిత శానిటరీ ఉపకరణాలను కూడా ముందుగానే కొనుగోలు చేసుకోవాలని ఆదేశించింది… నాడు-నేడు పథకాన్ని ఇంటర్, డిగ్రీ కాలేజీలు, వర్శిటీలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఇతర వైద్యారోగ్య సంస్థలకూ వర్తింప చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్.
‘నాడు – నేడు’ గైడ్‌లైన్స్ విడుదల

nadu nedu