Site icon NTV Telugu

Andhra Pradesh: రూ.258 కోట్ల వ్యయంతో రేపటి నుంచి వాలంటీర్లకు అవార్డులు

Volunteer Awards

Volunteer Awards

ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి వాలంటీర్లకు అధికారులు అవార్డుల సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. కనీసం సంవత్సర కాలంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్నారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర క్యాటగిరిల్లో వాలంటీర్లకు అవార్డులను ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది వాలంటీర్లకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. వాలంటీర్లకు పురస్కారాల కోసం రూ.258.74 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

 

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాలంటీర్ల పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తున్న వాలంటీర్లకు సీఎం జగన్ అందిస్తున్న చిరుసత్కారం ఇదని ప్రభుత్వం తెలిపింది. సేవా వజ్ర కింద రూ.30వేల నగదు, సేవారత్న కింద రూ.20వేల నగదు, సేవా మిత్ర కింద రూ.10వేల నగదు అందించనున్నారు. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారింది. ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే వాలంటీర్లు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్నారు. లబ్ధిదారులు వేరే ప్రాంతాల్లో ఉన్నా వాలంటీర్లు శ్రమపడుతూ అక్కడికి వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు.

https://ntvtelugu.com/minister-kanna-babu-questioned-pawan-kalyan-about-former-suicides/

Exit mobile version