జగనన్న విద్యాదీవెన పథకం కింద 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖాతాల్లో జమ అయిన ఈ సొమ్మును వారం, పది రోజుల్లో కాలేజీలకు విద్యార్థుల తల్లులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో నిధులను నేరుగా కాలేజీలకే జమ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఖాతాలో జమ అయిన డబ్బులను తల్లులు వెంటనే కాలేజీలకు చెల్లించాలని సూచించింది.
కాగా జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రస్తుత (2021- 22) విద్యా సంవత్సరంలో బోధనా రుసుం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు అనర్హులుగా తేలారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలువురికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో పరిధికి మించి ఇంటి విస్తీర్ణం కలిగి ఉన్నారని, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని, ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారన్న కారణాలతో దరఖాస్తుదారుల పేరుపై అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
Devineni Uma: పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?
