Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: మహేష్‌కు ‘సర్కారు’ వారు గుడ్‌న్యూస్

Mahesh Babu

Mahesh Babu

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన కొత్త చిత్రం సర్కారు వారిపాట. ఈ నెల 12 ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు కూడా థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లు పెంచనున్నాయి.

కాగా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్‌బాబు, రాజమౌళి తదితరులు గతంలో సీఎం జగన్ దగ్గరకు వెళ్లి సినిమా టిక్కెట్ రేట్లు పెంచాలని అభ్యర్థించడంతో ఆయా హీరోలు నటించిన సినిమాలకు ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతులు ఇస్తోంది. అయితే చాలా మంది టిక్కెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల సినిమాకు మంచి టాక్ వచ్చినా రిపీటెడ్ ఆడియన్స్ రావడం లేదని పలువురు ఆరోపిస్తు్న్నారు. అదే టిక్కెట్ రేట్లు తక్కువగా ఉంటే రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారని.. తద్వారా నాలుగు వారాల పాటు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Sarkaaru Vaaru Paata

 

Exit mobile version