Site icon NTV Telugu

అద్దె బస్సులు నడిపేందుకు ఆర్టీసీకి సర్కార్‌ అనుమతి

APSRTC

APSRTC

కరోనా ప్రభావం పబ్లిక్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. లాక్‌డౌన్‌ దెబ్బకు ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులు అన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి… ఇక, ఆ తర్వాత క్రమంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినా.. అద్దె బస్సుల చక్రాలు మాత్రం కదలలేదు.. అయితే, అద్దె బస్సుల వినియోగానికి ఏపీఎస్‌ఆర్టీసీ అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీంతో, సెప్టెంబరు 1 నుంచి అద్దె బస్సులను నడిపేందుకు సిద్ధం కావాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది సర్కార్.. మరోవైపు.. ప్రత్యేకంగా మార్గదర్శకాలు కూడా జారీ చేయనున్నారు.. ఈ లోగా బస్సుల్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు అధికారులు.. అద్దె బస్సులు కండీషన్‌.. రవాణాశాఖ డాక్యుమెంట్లు తీసుకోవాలని ఆదేశించారు.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2,840 అద్దె బస్సులు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రోడ్డెక్కనున్నాయి.

Exit mobile version