AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పుల చేర్పుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి అధ్యాయనం కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురు మంత్రులతో ఉప సంఘాన్ని నియమించింది. మంత్రి వర్గ ఉప సంఘం కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించింది ఏపీ సర్కార్. పరిపాలన సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.
Read Also: Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇక, జిల్లా రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని చెప్పుకొచ్చింది. అలాగే, జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సరిహద్దులు నిర్ణయించాలని తెలిపింది. సరిహద్దులు, పేర్లపై ప్రజలు, ప్రజానిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనింది.
