NTV Telugu Site icon

CM YS Jagan: ఆదాయ వనరులపై సర్కార్ ఫోకస్..

ఆదాయ వనరులు పెంచుకోవటంపై ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి మంద్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.. ఎస్‌ఓఆర్‌ పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించిన ఆయన.. వీటిని కార్యరూపంలోకి తీసుకు రావడంపై దృష్టి పెట్టాలన్నారు.. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లదే క్రియాశీలక పాత్ర అని స్పష్టం చేశారు.. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలన్న ఆయన.. రాబడులను పెంచుకునే క్రమంలో కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలని.. పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Gold Price: గుడ్‌ న్యూస్‌.. మళ్లీ 50 వేల దిగువకు..