ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. వివిధ రకాల అనుమతుల పేర్లతో అధికారులు తనిఖీలు చేశారు. చిన్న లోపాలకు సైతం జరిమానాలు విధించిన అధికారులు… నిబంధనలు పాటించని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. దాంతో ప్రభుత్వ తీరుపై ఎగ్జిబిటర్ల ఆందోళనకు దిగారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఎగ్జిబిటర్ల చెబుతున్నారు. విజయవాడలో ఎగ్జిబిటర్ల అత్యవసర సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ సెంటర్లలో ప్రస్తుత టికెట్ ధరలతో థియేటర్లను నడపలేమని యజమానులు చెబుతున్నారు. నష్టాలతో నడిపే బదులు మూసివేయడం మేలని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. రేపు సమావేశం అనంతరం థియేటర్లు మూసివేసే అంశంపై యజమానులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.
ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు… పలు చోట్ల సీజ్…!
