Posani Krishna Murali: తన ఊపిరి పోయే వరకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే ఉంటానని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.. ఇవాళ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, జగన్‌ని దూరం నుంచి చూసి వచ్చానని తెలిపారు.. అయితే, చచ్చే వరకు జగన్‌తోనే ఉంటాను, వైసీపీ జెండామోస్తానని అని ప్రకటించారు పోసానీ కృష్ణ మురళి.. ఇక, తన పాత రోజులను గుర్తుచేసుకున్న పోసాని.. నాగార్జున యూనివర్శిటీకి వెళ్లే వరకు నాకు రాజకీయాలు తెలియవు.. గౌతం రెడ్డి ద్వారానే విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చా.. ఆ తర్వాత నాకు దురద మొదలైందన్నారు. సీఎం జగన్ నాకు ఈ పదవి ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు.. నాకు 11 ఏళ్ల నుంచి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసు.. నన్ను ఎప్పుడూ పిలుస్తుండేవారు.. కానీ, నేను ఏనాడు ఆయన్ని కలవలేదు.. డుమ్మా కొట్టేవాడినన్నారు.
Read Also: Viral Video: ‘నేను లాయర్’..సీటుపై కాలు తీయమన్నందుకు యువతి హల్‌చల్
మరోవైపు, సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు పోసాని.. వైఎస్ జగన్ నాకు ఎంతో ఇష్టం.. దూరంగా ఆయన్ని చూస్తూ ఉండేవాడినన్నారు.. ఎందుకంటే.. చాలా మంది కులాల్లో నుంచి, మతాల్లో నుంచి, డబ్బుల్లో నుంచి నాయకులు పుడతా ఉంటారు.. కానీ, జగన్మోహన్‌రెడ్డి జనాల్లో నుండి పుట్టిన నాయకుడిగా అభివర్ణించారు.. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం అని వెల్లడించారు.. ఆయన వ్యక్తిత్వం చూశా.. అందుకే ఆయనతో స్నేహం చేశా.. జగన్ మోహన్‌రెడ్డి ఈజ్ ఏ స్వీటెస్ట్, ఈజ్ ఏ హాటెస్ట్, ఈజ్ ఏ హానెస్ట్, ఈజ్ ఏ గ్రేటెస్ట్ నథింగ్ బట్ ఎవరెస్ట్.. అలాంటి వ్యక్తి కాబట్టే.. ఆయన ఇచ్చిన ఈ పదవి తీసుకున్నాను.. నేను సినీ పరిశ్రమకు ఎంత మంచి చేస్తానో తెలియదు.. కానీ, చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అబద్దాలు చెప్పను.. ఆకాశం నుంచి నేను చుక్కలు దింపుతానని చెప్పను.. కానీ, నేను ఎంత చేయాలి అనుకుంటున్నాను.. జగన్ అంత స్వేచ్చనాకు ఇస్తారని చెప్పుకొచ్చారు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.
