Site icon NTV Telugu

గోదావరిలోనే మునుముందు సమస్యలు : ఏపీ ఈఎన్సీ

జీఆర్ఎంబీ‌, కేఆర్ఎంబీ సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది. టైం షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం సమాచారం కావాలని కోరారు అని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని చర్చిస్తాం అని చెప్పారు. టైం ఫ్రేమ్ కావాలని వాళ్లు అడిగారు. ప్రభుత్వంతో చర్చించి అన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పాం. తెలంగాణ హాజరు కాని విషయాన్ని వారినే అడగండి. మేం అన్ని ప్రొసీజర్స్ ను గౌరవిస్తాం. నోటిఫికేషన్ లో ప్రాజెక్టుల అనుమతుల టైం బాండ్ అనేది ఇప్పుడు అనవసరం. దాన్ని ఫ్రేమ్ వర్క్ చేయాలి అన్నారు.

ఇక కృష్ణా నీరు వృధాగా పోతున్న నీరు ఏపీ తీసుకుంటామంటున్నా.. తెలంగాణ ఒప్పుకోవడం లేదు.సముద్రంలో కలిసే నీటిని మేం వాడుతామంటే.. వాటిని కౌంట్ చేయాలని తెలంగాణ అంటోంది. రానున్న రోజుల్లో గోదావరి బోర్డు కీలకం గా మారబోతుంది. గోదావరిలోనే మునుముందు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 1454 టీఎంసీలు ఉంటే.. 1340 టీఎంసీలు తెలంగాణ డైవర్ట్ చేయబోతుంది. అదే జరిగితే.. గోదావరి డెల్టా, పోలవరం ఆయకట్టుకు నీరు లభించదు అని పేర్కొన్నారు.

Exit mobile version