Site icon NTV Telugu

LIVE: సీఎస్ కు సమ్మె నోటీసు.. స్టీరింగ్ కమిటీ సంచలనం

Live: సీఎస్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన తరవాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సంచలన ప్రెస్ మీట్ | Ntv Live

సీఎస్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన తరవాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇది చాలా బాధాకరమైన రోజు. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం అధికారుల కమిటీ మాటలనే వినింది. ప్రభుత్వం సమాజాన్ని తప్పుదోవ పుట్టిస్తోంది. ఈ నెల పాత జీతాలనే ఇవ్వండి అని కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.

ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. కమిటీ అధికార పరిధి ఏంటో తెలియకుండా చర్చలకు హాజరుకాలేం అని చెప్పాం. ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ జీవో కాపీ మాకు ఇచ్చారు.సీఎస్ అథరైజ్ చేసిన శశి భూషణ్ కు సమ్మె నోటీసు ఇచ్చాం. ఏపీలో ఉన్న ఉద్యోగ వర్గాలు మొత్తంగా సమ్మెలో పాల్గొననున్నాయని తెలిపారు.

Exit mobile version