Site icon NTV Telugu

ఏపీ ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండివైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ పై కీలకంగా చర్చలు జరిగాయి. అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి వచ్చాయి. సమ్మె నోటీసులో పీఆర్సీ, అనుబంధ అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పొందుపరుస్తామన్నారు. వైద్యారోగ్యశాఖ విషయాలను, అక్కడ వున్న కార్మిక చట్టాలకు అనుగుణంగా సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు.

7వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి నిరసనకు దిగుతారన్నారు. పాత జీతం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఉద్యోగసంఘాలన్నీ కలిపి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమరానికి సై అంటున్నాయి అన్ని సంఘాలు. పీఆర్సీ వల్ల కలిగిన నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేశాయి. నాలుగుజీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే… ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేశారు. రేపు మంత్రులతో చర్చలకు హాజరు కావాలని ఆహ్వానించారు శశి భూషణ్. పీఆర్సీ జీఓలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామంటున్నారు ఉద్యోగ సంఘ నేతలు.

ట్రెజరీ ఉద్యోగులపై అధికారుల నుంచి వత్తిడి వస్తోందన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మాకు పాత జీతాలు ఇవ్వాలని కోరాం. ఉద్యోగులపై వత్తిడి తేవద్దని బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.ఉద్యోగులను రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని శశిభూషణ్ ద్వారా ఫోన్లు వచ్చాయన్నారు. స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు నాలుగు సంఘాలు ఒకేమాట ద్వారా ముందుకెళతామన్నారు. పీఆర్సీ జీవోలు రద్దుచేసేవరకూ ఎలాంటి చర్చలకు రాబోమన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వాస్తవం కాదన్నారు.

Exit mobile version