Site icon NTV Telugu

పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఏపీలో పీఆర్సీ రగడ జరుగుతోంది. పీఆర్సీ జీవోల పై భగ్గు మంటున్న ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జీవోలు రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా డీఏలు మాకు ఇచ్చి జీతంలో సర్దుబాటు చేయడం ఉద్యోగులను మోసం చేయడమే అన్నారు. 10 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని సీఎస్ చెప్పిన లెక్కలన్నీ బోగస్ అని విమర్శించారు. కేంద్ర పే స్కేలును అమలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. మా అంగీకారం లేకుండా ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంటుందన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

ఇదిలా వుంటే పీఆర్సీ జీవో కాపీలను దగ్దం చేశాయి ఏపీఎన్జీవో సంఘం నేతలు. జీతాల కోతను అంగీకరించేది లేదంటున్నారు మహిళా ఉద్యోగులు. ఏపీ ఎన్జీవో మహిళా ఉద్యోగులు ఈ రివర్స్ పీఆర్సీ మాకు వద్దు అంటున్నారు. డీఏలను కలుపుకుని జీతం లెక్క పెట్టడం కరెక్ట్ కాదు. ఇంటి అద్దె లు పెరుగుతుంటే ప్రభుత్వం హెచ్ఆర్ఏ తగ్గించటం ఏంటి? మేము రోడ్ల మీద గుడిసెలు వేసుకుని ఉండాలని ప్రభుత్వం భావిస్తోందా? చర్చల సమయంలో హెచ్ఆర్ఏ తగ్గిస్తాం, సీసీఏ రద్దు చేస్తాం అనే విషయాలు చెప్పలేదన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

ఏపీ ఉద్యోగ సంఘ నేతలు బండి, బొప్పరాజు

గురువారం ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ల ముట్టడి జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన G.O లను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో జిల్లా కలెక్టరేట్ ల ముట్టడికి పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించింది జేఏసీల ఐక్యవేదిక. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు

Exit mobile version