Site icon NTV Telugu

ఎమ్మెల్సీలతో విద్యాశాఖ మంత్రి భేటీ.. జాతీయ విద్యావిధానంపై చర్చ

Adimulapu Suresh

Adimulapu Suresh

టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభినందించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జాతీయ విద్యావిధానం అమలుపై పలు సలహాలు సూచనలు చేశారు టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు. ఈ సమావేశంలో శాసన మండలి ప్రొటెమ్ ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యావ్యవస్థలు కీలక మార్పులు తీసుకొచ్చింది ఏపీ సర్కార్‌.. ఇదేసమయంలో.. జాతీయ విద్యావిధానాన్ని కూడా అభిప్రాయాలకు అనుగుణంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది.

టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. సచివాలయం 5వ బ్లాక్‌లో సమావేశం జరుగుతుంది. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు మంత్రి స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు అమలవుతున్న పధకాలను ఎమ్మెల్సీలు ఆభినందించారు. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీలు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, డైరెక్టర్ చిన్నవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version